ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నేతన్నలకు శుభవార్త.. చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేతన్న నేస్తం’ పథకం కింద లబ్ధిదారులకు ఇవాళ సీఎం జగన్ నిధులు అందించనున్నారు. 80,686 మంది ఖాతాల్లో రూ. 24 వేల చొప్పున మేర జమ చేస్తారు.
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వర్చువల్‌గా లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం వైయస్.జగన్. ఇప్పటికే అర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. కాగా, ఈ పథకం ద్వారా గత నాలుగేళ్లలో నేతన్నలకు రూ.776 కోట్ల సాయం అందింది. ఈ సారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేత కార్మికులకు లబ్ది చేకూరనుండటంతో.. రూ.193.64 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు సీఎం జగన్.