నేడు కొలువుదీరనున్న ఏపీ కొత్త కేబినెట్​.. 11 మంది పాతవారే

-

జగన్‌ కొత్త కేబినేట్‌ ఫైనల్‌ అయింది. ఎన్నో సమీకరణాలు, ఇంకెన్నో కూడికలు, ఎన్నో తీసివేతల మధ్య జగన్‌ నూతన కేబినేట్‌ కూర్పు ఫైనల్‌ అయిపోయింది. మొత్తం 25 మందిని కొత్త కేబినేట్‌ లోకి తీసుకున్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. నూతన మంత్రి వర్గం నేడు ఉదయం 11.30 గంటలకు కొలువుదీరనుంది. అయితే.. ఈ కొత్త కేబినేట్‌ లో ఏకంగా 11 మంది పాత వారే కావడం విశేషం. మిగతా వారంతా కొత్త మంత్రులే.

కొత్త మంత్రి వర్గంలో గుడివాడ అమర్నాథ్, పి. రాజన్న దొర, ధర్మాన ప్రసాద్ రావు, సిదిరి అప్పల్రాజు, బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణు, బీ. ముత్యాల నాయుడు, మెరుగు నాగార్జున, విడదల రజిని, కాకాని గోవర్థన్ రెడ్డి, అంజాద్ బాషా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, నారాయణ స్వామి, ఆర్కే రోజా, బుగ్గన రాజేంద్ర రెడ్డి, జయరామ్, ఆదిమూలపు సురేష్, ఉషా శ్రీ చరణ్, దాడిశెట్టి రాజా, అంబటి రాంబాబు, పిని విశ్వరూప్, తానేటి వనిత, కే. నాగేశ్వర్ రావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ లకు జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కింది. పాత క్యాబినెట్ నుంచి 9 మందికి అవకాశం లభించింది. సామాజిక సమీకరణాల ప్రకారం, జిల్లా ప్రాతినిథ్యం, సమర్థత, సినియారిటీని ఆధారంగా చేసుకుని మంత్రి వర్గం కూర్పు ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version