కేంద్రంపై టీఆర్ఎస్ వ‌రి పోరు.. నేడు ఢిల్లీలో కేసీఆర్ దీక్ష

-

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించే ప్ర‌తి గింజ‌ను కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేయాల‌ని టీఆర్ఎస్ పార్టీ ఆందోళ‌న‌లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో ర‌హ‌దారుల దిగ్భ‌దం, ఇళ్ల పై న‌ల్ల జెండాలు ఎగ‌ర‌వేసి నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం వంటి కార్యక్ర‌మాల‌ను నిర్వ‌హించారు. కేంద్ర ప్ర‌భుత్వంపై మ‌రింత ఒత్తిడి తీసుకుర‌వ‌డానికి నేడు ఢిల్లీలో ఆందోళ‌న చేయ‌నున్నారు. ఢిల్లీలోని తెలంగాణ భ‌వ‌న్ లో సీఎం కేసీఆర్ ఈ రోజ దీక్ష చేయ‌నున్నారు. ఈ దీక్షకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్ర‌జా ప్ర‌తినిధులు అంద‌రూ హాజ‌రు కాబోతున్నారు.

దాదాపు 1,500 మందికి పైగా ప్ర‌జా ప్రతినిధులు ఢిల్లీలో సీఎం కేసీఆర్ దీక్ష హాజ‌రు కానున్నారు.ఇప్ప‌టికే వీరు ఢిల్లీ చేరుకున్నారు. కాగ తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం త‌ర్వాత తొలి సారి కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయ‌బోతున్నారు. అలాగే ముఖ్య మంత్రి హోదాలో కూడా కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేయ‌డం ఇదే తొలిసారి. కాగ గ‌తంలో ముఖ్య‌మంత్రి హోదాలో ఉండి ఢిల్లీ లో దీక్ష చేసిన వారు ఉన్నారు. ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న స‌మయంలో ఢిల్లీలో దీక్ష చేశారు. అలాగే ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంపై ఆందోళ‌న చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version