మైనింగ్ లీజుల కేటాయింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

-

ఏపీలో అధికారంలో వైసీపీ ప్రభుత్వం అన్ని శాఖల్లో కీలక మార్పులకి శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మైనింగ్ లీజుల కేటాయింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఇకపై హైపవర్ కమిటీ ద్వారానే గనుల లీజుల కేటాయించనున్నారు. ఈ ఆక్షన్ ద్వారా మైనింగ్ లీజులను హైపవర్ కమిటీ ద్వారా ఖరారు చేసేలా నిన్న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో హైపవర్ కమిటీ ఏర్పాటు చేశారు.

ఆర్ధిక, పరిశ్రమలు, గనుల శాఖ కార్యదర్శులతో పాటు ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్, సర్వే ఆఫ్ ఇండియాలకు చెందిన ఉన్నతాధికారులతో ఈ హైపవర్ కమిటీ ఉండనుంది. మైనింగ్ లీజులు, గనుల బ్లాక్ ల కేటాయింపు.. రిజర్వు ధర నిర్ధారణ, ఆర్హతల నిర్దారణలో హైపవర్ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది. ఇక ఈ హైపవర్ కమిటీ కన్వీనరుగా ఏపీ భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారి వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. గనుల కేటాయింపులో పారదర్శకత కోసమే ఈ కీలక మార్పులు చేశామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version