ప్రభాస్ అభిమానులకు సర్ప్రైజ్ రానుంది.. ఆ రోజే..!

-

కరోనా కారణంగా నిలిచిపోయిన చిత్రాల షూటింగులన్నీ ఒక్కొక్కటిగా మళ్ళీ పట్టాల మీదకెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోల సినిమాల నుండి అప్డేట్ల కోసం అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఐతే అందులో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తి ఇంకా ఎక్కువగా ఉంది. దానికి కారణం ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలే. మూడు సినిమాలని చేతిలో పెట్టుకున్న ప్రభాస్, ఏ సినిమా నుండి ఏ అఫ్డేట్ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 23వ తేదీన పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రభాస్, తన సినిమాల నుండి ఏ అప్డేట్ ఇవ్వబోతున్నాడని ఆసక్తిగా ఉంది.

ఐతే ఈ విషయమై నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చాడు. సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ప్రభాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని సాలిడ్ అప్డేట్ రాబోతుందట. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి నాగ్ అశ్విన్ బదులిచ్చాడు. ఇదే కాదు రాధేశ్యామ్ చిత్రం నుండి సైతం అప్డేట్ వస్తుందని ఆశిస్తున్నారు. అలాగే బాలీవుడ్ దర్శకుడితో మొదలు పెట్టిన ఆదిపురుష్ చిత్రం నుండి అప్డేట్ వచ్చే అవకాశం కలదు. ఐతే వీళ్ళెవరూ ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినప్పటికీ నాగ్ అశ్విన్ మాత్రం అప్డేట్ వస్తుందని చెప్పేసాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version