అసలే అంతంతమాత్రం… మళ్లీ టీడీపీలో ఇదొకటా?

-

2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ బొమ్మ తిరగబడిపోయింది! ఇప్పట్లో తేరుకోలేరు అనేస్థాయిలో జగన్ మార్కు దెబ్బ పడింది! ఈ పరిస్థితుల్లో టీడీపీ అధినాయకత్వం చేయాల్సిందేమిటి? సరే చంద్రబాబు అయితే.. అటు రూము కి ఇటు జూముకి పరిమితమైపోయారు! మరి చినబాబు ఏమి చేయాలి? కాని అది చేయడం లేదు సరికదా.. చేయకూడనివి చేస్తున్నారు!

అవును… ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ మీద ఉన్నది మామూలు బాధ్యత కాదు. అక్కడున్నది జగన్. కాబట్టి… జగన్ పడిన కష్టం కంటే ఎక్కువగా.. జగన్ కల్పించిన నమ్మకం కంటే ఎక్కువగా.. జగన్ ఇచ్చిన భరోసా కంటే ఎక్కువగా కల్పించాలి! అది కేడర్ కి అయినా జనాలకు అయినా.. నాయకులకైనా!

కానీ చినబాబు అది చేయడంలేదు! ఒంటెద్దు పోకడలకు పోతున్నారు.. ఇది సినిమా కాదు నిజ జీవితం. ఇలానే ఉంటే టీడీపీ బొమ్మ ఇప్పట్లో కనిపించదు ఇంక! ప్రస్తుతం వర్షాల వల్ల నష్టపోయిన రైతులను కలుస్తానని బయలుదేరిన చినబాబు.. స్థానిక నాయకులను, పెద్ద నాయకులను కలుపుకునిపోవడంలో పుష్కలంగా విఫలమవుతున్నారు!

కొత్తగా అధ్యక్షుడైన అచ్చెన్నాను వెంటబెట్టుకుని వెళ్తే మరింత ప్లస్ అయ్యేది. ఆ పనీ చేయడం లేదు. సరే అచ్చెన్నకు చినబాబుకు మధ్య గ్యాప్ ఉందని అనుకుంటే… ఇప్పుడు గ్యాప్ లు పెట్టుకునే పరిస్థితులు కాదు. జనాలకు పార్టీకి ఉన్న గ్యాప్ సరిపోతుంది… మళ్లీ ఉన్న నలుగురిలో కూడా గ్యాప్ లు పెట్టుకుంటూ, కలుపుకుపోకుండా ఉంటే… ఈ గ్యాప్ కాస్త లాంగ్ గ్యాప్ అయ్యే ప్రమాధం లేకపోలేదు! మరి చినబాబు ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి కలుపుకుపోతారా లేక పార్టీని కాలగర్భంలో కలిపేస్తారా అన్నది వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Exit mobile version