నేడు విశాఖ మేయర్ పై అవిశ్వాసం తీర్మానం..ఉందనుంది. శాఖ మహానగర పాలక సంస్థ మేయర్‌పై కూటమి ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ సమావేశం జరగనుంది. అవిశ్వాస తీర్మానం నెగ్గేందుకు కూటమికి 74 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి.

మరోవైపు మలేషియా నుంచి విశాఖకు కూటమి కార్పొరేటర్లు చేరుకున్నారు. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో దస్పల్ల హోటల్‌కు కార్పొరేటర్లు వెళ్లారు. ఇప్పటికే వైసీపీ 58 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది.
కాగా విశాఖలో వైసీపీకి షాక్ తగిలింది. అవంతి శ్రీనివాస్ కుమార్తె ప్రియాంక రాజీనామా చేశారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కుమార్తె, ఆరో వార్డు కార్పొరేటర్ ప్రియాంక వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు లేఖ పంపారు.