ఆసుపత్రులందు “రమేష్ హాస్పటల్” వేరయా…!

-

ఆసుపత్రులందు రమేష్ హాస్పటల్ వేరయా… విశ్వదాభిరామ.. ధనాపేక్షే ముఖ్యం మామ! అన్న చందంగా దూసుకుపోతోంది రమేష్ హాస్పటల్ యవ్వారం! విజయవాడ స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాధం అనంతరం… రమేష్ హాస్పటల్ వ్యవహారాలపై విచారణ చేపట్టిన అధికారులకు ఆ ఆసుపత్రి యాజమాన్యం కేవలం ధనాపేక్షే పరమావధిగా చేస్తోన్న పనులు బయటపడుతున్నాయంటున్నారంట. ఈ ప్రమాధం జరిగిన వెంటనే… నేరం మాది కాదు.. హోటల్ యాజమాన్యానిదే, తాము ప్రభుత్వ అనుమతితోనే కోవిడ్ సెంటర్ నడుపుతున్నామని చెప్పిన రమేష్ హాస్పటల్ యాజమాన్యం ఇప్పుడు ఇరకారంలో పడిందని అంటున్నారు!

కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్న స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌ లో ఎలాంటి రక్షణ ఏర్పాట్లూ లేవు.. అగ్నిమాపక పరికరాలు లేవు.. అవన్నీ తెలిసినా కూడా రమేష్‌ హాస్పటల్స్‌ యాజమాన్యం అక్కడ కోవిడ్‌ సెంటర్ ‌ను హడావిడిగా ఏర్పాటు చేసేసిందట. కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ దాఖలుచేసిన పత్రాల్లో “కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ ఫర్‌ పాజిటివ్‌ కేసెస్‌” అని స్పష్టంగా పేర్కొన్నా కూడా… వారు ఉంచిన 30 మందిలో 26 మందికి కరోనా నెగటివ్‌ వ్యక్తులే ఉండటం గమనార్హం.

అంటే… కోవిడ్‌ అనుమానంతో వచ్చిన వారికి టెస్టులు చెసి, బెదిరించి, కంగారు పెట్టించి… కోవిడ్ సెంటర్స్ లో చేర్చేసుకుంటున్నారు. ఫలితంగా ధనాపేక్షే లక్ష్యంగా ముందుకుపోతున్నారు! ఇదే సమయంలో… ఫార్మసీ ఏర్పాటుకు, శానిటైజేషన్, ఆక్సిజన్‌ సప్లయిర్స్, హెల్త్‌ వర్కర్స్, హాస్పటల్‌ వేస్టేజ్ ‌కు సంబంధించిన ఎలాంటి ఒప్పందాలు చేసుకోకుండానే నడుపుతున్నారని విచారణలో తేలిందంట!! దీంతో తవ్వేకొద్దీ రమేష్ హాస్పటల్ యవ్వారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని అంటున్నారట విచారణాధికారులు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version