ముసలితనంలో మతిమరుపు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకోండి

-

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వయసు ముదురుతుంటే ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా ముసలి వాళ్ళలో మతిమరుపు సమస్య కనిపిస్తుంది. ఈ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి పక్కన పెట్టేస్తే ఈ సమస్య రాకుండా ఉండటానికి కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి.

పసుపు:

ఇందులో కర్క్యుమిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉండటం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది. అందుకే రోజు వారి డైట్‍లో కచ్చితంగా పసుపును భాగం చేసుకోవాలి. ఇది మతిమరుపు సంబంధిత సమస్యలు రాకుండా మెదడును చురుగ్గా ఉంచుతుంది.

చేపలు:

ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కలిగిన సాల్మన్ చేపలను డైట్ లో భాగం చేసుకోవడం వల్ల మతిమరుపు సంబంధ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

పాలకూర:

ఇందులో విటమిన్ ఏ తో పాటు ఫోలేట్ కూడా అధికంగా ఉంటుంది. వయసు రీత్యా వచ్చే మతిమరుపు సమస్య నుండి బయట పడాలంటే పాలకూరను తినాలి. ఇది మెదడుని ఎల్లప్పుడూ చురుకుగా ఉంచడంలో సహాయపడుతుంది.

బ్లూ బెర్రీస్:

మెదడును ఎప్పటికప్పుడు చురుగ్గా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు బ్లూబెర్రీస్ లో పుష్కలంగా ఉంటాయి. మీకు ఇవి ఎక్కడ కనపడినా తినడం మర్చిపోవద్దు.

డార్క్ చాక్లెట్:

చాక్లెట్ అనగానే కొందరు స్వీట్ అనుకుని భయపడతారు. కాకపోతే డార్క్ చాక్లెట్ తినడం వల్ల మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల మెదడుకు రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. వయసు రీత్యా వచ్చే మతిమరుపు రాకుండా ఉంటుంది.

గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది, కేవలం అవగాహన కోసం మాత్రమే. “మనలోకం” ధృవీకరించడలేదు. పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Exit mobile version