వైసీపీలో ఎవ్వర్నీ వదిలేదే లేదు.. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాను : మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు

-

మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలు మంచి తీర్పు ఇచ్చారని అన్నారు. ప్రజలందరూ ఉత్సాహంగా, హుషారుగా ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ నాలాంటి వారిపై ఎంతో మంది తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందినైతే ఇంటింటికెళ్లి చంపేశారన్నారు. దౌర్జన్యాలు చేశారు. ఇల్లులు తగులబెట్టారు.

ఎస్సీ, బీసీ, ఎస్టీ అని చూడకుండా అనేక కేసులు పెట్టించారని మండిపడ్డారు. వైసీపీలో ఎవర్నీ వదిలేది లేదని, వారందర్ని కూడా కటకటాల్లోకి పంపించడం పక్కా అని ధ్వజమెత్తారు. కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటానని అన్నారు. చంద్రబాబు వదిలిపెట్టినా నేను మాత్రం వదలనని అన్నారు. మనల్ని రెచ్చగొట్టి మళ్లీ, మన మీదే అనేక తప్పుడు కేసులు పెట్టించడం సరైందని కాదని, ముఖ్యంగా సైకో విజయసాయిరెడ్డిని అస్సలు వదిలేది లేదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version