వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పేర్కొన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. వైఎస్సార్ పాలనకు జగన్ పాలనకు భూమికి.. ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జలయజ్ఞం పై వైఎస్సార్ ఎంతో దృష్టి పెట్టారని పేర్కొన్నారు. ఆయన 17 శాతం నిధులు ఇస్తే.. జగన్ 2.5 శాతమే ఖర్చు చేశారని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదు అన్నారు. రాజధాని, ప్రత్యేక హోదా లేదన్నారు. ఉన్నవన్నీ అప్పులే.. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రాన్ని శాసిస్తోంది. ఆ పార్టీకి వైసీపీ నేతలు కట్టు బానిసలు అన్నారు. సొంత లాభం కోసం రాష్ట్రాన్నే తాకట్టు పెట్టారు. 25 మంది ఎంపీలు ఉన్నా తెచ్చింది గుండు సన్నా.. పులి కపున పులే పుడుతుంది. నా వైఎస్ఆర్ రక్తం.. ఎవ్వరూ అవునన్నా.. కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే అని వ్యాఖ్యానించారు షర్మి.