బీజేపీ సంచలన నిర్ణయం…రఘురామరాజుకు నో టికెట్‌…?

-

బీజేపీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రఘురామరాజుకు టికెట్‌ ఇవ్వకూడదని..అతనిపై గ్రౌండ్‌ రిపోర్టు బాగాలేదని బీజేపీ పార్టీ గుర్తించిందట. ఏపీలో బిజేపి ఎంపీ అభ్యర్థుల అంచనా ప్రకారం… నరసాపురం నుంచి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు లేదా శ్రీనివాస వర్మ పేర్లు పరిశీలిస్తున్నారట.

raghurama-krishnam-raju- on vyugam movie

రాజమండ్రి- పురంధేశ్వరి, అనకాపల్లి- సీఎం రమేష్, రాజంపేట- కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి- మాజీ ఐఎఎస్ వరప్రసాద్ లేదా రత్నప్రభ పేర్లు ప్రచారంలో ఉన్నాయట. అరకు నుంచి కొత్తపల్లి గీత బరిలో ఉంటారట. అయితే.. ఈ లిస్టులో రఘురామరాజు లేదని సమాచారం. కానీ.. తెలుగుదేశం, జనసేన పార్టీలకు కేటాయించిన పార్లమెంటు స్థానాల జాబితాలో నరసాపురం స్థానం లేదని, ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లుగా స్పష్టమయ్యిందని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version