YSR హెల్త్ యూనివర్సిటీగా కొత్త బోర్డు..ఫోటోలు వైరల్‌

-

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. దీనికి గవర్నర్‌ కూడా ఆమోదం తెలపడంతో… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త YSR హెల్త్ యూనివర్సిటీగా మారిపోయింది.

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు అధికారికంగా మారిపోయింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు స్థానంలో డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డును యూనివర్సిటీ అధికారులు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన యూనివర్సిటీకి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు అసెంబ్లీలో ప్రభుత్వం బిల్లు పాస్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version