నందిగం సురేష్ బిగ్‌ షాక్‌…ఇంటికి నోటీసులు !

-

Nandigam Suresh: బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కి చెందిన భవనానికి అనుమతులు లేవంటూ అధికారులు నోటీసులు ఇచ్చారు.

Bapatla MP Nandigam Suresh

వారంలోగా వివరణ ఇవ్వాలని, లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవనం అమరావతి పరిధిలో ఉన్నందున సిఆర్డిఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.

ఇక అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే వంశీపై కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ 71గా వంశీ పేరు చేర్చారు పోలీసులు. ఇప్పటికే ఈ కేసులో 15 మందిని అరెస్ట్ చేయగా రిమాండ్ విధించిన న్యాయస్థానం.. తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరో కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version