నేడు కాంగ్రెస్‌లోకి రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

-

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చూసిన బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు పునరావృతం అయ్యాయి. ఇక అప్పటి నుంచి పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. వరుసగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీ సంఖ్యలో హస్తం కండువా కప్పుకున్నారు. తాజాగా మరో ఆరేడు మంది కాంగ్రెస్లో చేరేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోని గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌ హస్తం గూటికి చేరనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. గతంలోనే ప్రకాశ్‌ గౌడ్‌ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రచారం జరగగా.. అలాంటిదేమీ లేదంటూ ఆయన ఖండించారు. తాజాగా ఆయనతోపాటు ఇద్దరు, ముగ్గురు మున్సిపల్‌ ఛైర్మన్లు సైతం చేరనున్నట్లు తెలిసింది. మరో వారంలో నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అదే బాట పట్టనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version