ఏపీ విద్యార్థులకు, ప్రజలకు శుభవార్త చెప్పింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. ఈ నెలలో సంక్షేమ పండుగ కొనసాగనుంది. ఈ నెల 19 నుంచి జనవరి 29 వరకు వరుస పథకాలు అమలు చేయనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 19న జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అందించనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్.
జనవరి 1 నుంచి వైఎస్సార్ పింఛన్ భరోసా ఇవ్వనున్నారు. అదే నెల 10 నుంచి వైఎస్సార్ ఆసరా కూడా అందించనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 21న విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ చేయనున్నారు. జనవరి 29వ తేదీ నుంచి వైఎస్సార్ చేయూత సాయం విడుదల చేయనుంది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. కాగా, మొన్న జరిగిన కేబినేట్ సమావేశం పెన్షన్ లబ్ది దారులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. సామాజిక పెన్షన్ లను 2,750 నుంచి 3,000 పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జగన్ సర్కార్.