ఎన్టీఆర్ 102వ జయంతి సందర్బంగా… ఏపీ సీఎం చంద్రబాబు సంచలన పోస్ట్ చేశారు. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తుదంటే అది ఎన్టీఆర్ ఆశీర్వాదబలమే అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను అన్నారు.

పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరా లను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్ అని పొగిడారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఆయన అని తెలిపారు. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నామని ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.