విశాఖ ఉక్కు ఉద్యోగులకు ఎదురు దెబ్బ తగిలింది. ఆర్థిక పరిస్థితి బాగాలేదని.. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్కు ఉద్యోగుల అలవెన్స్ లలో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఒక్క ఉద్యోగికి 3000 రూపాయలు అలవెన్స్ తగ్గిపోతుంది. ఈ తగ్గింపు ఆగస్టు నెల నుంచి అమలు చేయబోతున్నట్లు కూడా తాజాగా ప్రకటన వెలువడింది.
వచ్చే మార్చి నెల వరకు… ఈ కోత ఉంటుందని తెలిపింది విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ఉక్కు ఉద్యోగులకు 2007లో చివరిసారిగా…అలవెన్స్లో సవరణ చేశారు. అయితే అందులో కూడా వేతనాన్ని నాలుగు భాగాలుగా విడదీశారు. ఇక ఇప్పుడు ఉక్కు ఉద్యోగులకు అలవెన్స్ లో కోత విధించేందుకు రంగం సిద్ధం చేసింది. నెలకు 3000 కట్ చేయడంతో దాదాపు 100 కోట్ల ఆదా అవుతుందని.. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఓ లెక్క కట్టుకుందట. అందుకే డబ్బులను ఆదా చేసుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకుందట. అయితే దీనిపై ఉక్కు ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు.