తెలంగాణాలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది.. ఇప్పటికే పలువురు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న ఆ పార్టీ.. తాజాగా గద్వాల్ జిల్లాపై కన్నేసింది.. జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తో పాటు, ఎమ్మెల్సీ తో మంతనాలు జరిపి.. రేపో మాపో పార్టీలో చేరుతారనుకున్న సమయంలో ఆ చేరికలకు బ్రేక్ పడింది.. మంచిరోజు చూసుకుని చేరుతామన్న ఆ నేతలు ఇప్పుడెందుకు ఆగిపోయారు..? వారిని అడ్డుకుంటుందెవ్వరో చూద్దాం..
గద్వాల్ జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే , ఎమ్మెల్సీ కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు ఎమ్మెల్సీ సీఎం రేవంత్ రెడ్డి బేటీ అయ్యారు.. తనతో పాటు ఎమ్మెల్యే కూడా పార్టీలోకి వస్తారని.. ఆషాడం ముగిసిన తర్వాత చేరుతామని చెప్పారట.. ఇప్పుడు ఆషాడం పోయి.. శ్రావణమాసం వచ్చినా.. ఆ ఊసే ఎత్తడం లేదట.. అందుకు బలమైన కారణం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి..
పార్టీలో చేరిన తర్వాత నియోజకవర్గ పెత్తనమంతా తనకే ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రతిపాదనలు పెట్టారట.. ఎమ్మెల్యే అయితే వచ్చె ఎన్నికల్లో టిక్కెట్ హామీ ఇవ్వాలని అడిగారట.. దీనిపై కాంగ్రెస్ సాప్ట్ గా ఆలోచించినా.. ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ మాత్రం వారి చేరికను అడ్డుకుంటున్నారని ఆయన శిభిరం నేతలు చర్చించుకుంటున్నారు..
వారిద్దరూ పార్టీలో చేరితే తన హవాకు బ్రేకులు పడతాయని సదరు ఇంచార్జ్ భావిస్తున్నారట.. దానికి తోడు ఇటీవల తుమ్మిళ్ల లిప్ట్ నుంచి నీటి విడుదల వ్యవహారం కూడా రచ్చకెక్కడంతో వారు అంతర్మథనంలో పడినట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీలో వారి
చేరికపై శ్రావణమాసంలో అయినా నిర్ణయం తీసుకుంటారో లేదో అని లోకల్ గా చర్చ నడుస్తోంది..