కేతిరెడ్డి మీద పరిటాల శ్రీ రామ్ ఫైర్.. తంతే విదేశాల్లో పడతావు  !

-

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద పరిటాల శ్రీరామ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పాస్పోర్ట్ వీసా సిద్ధం చేసుకో, ఈసారి తంతే విదేశాల్లో పడతావు అంటూ ఆయనకు వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్ పేరు పలికేందుకు కూడా కేతిరెడ్డి అనర్హుడు అంటూ ఆయన అన్నారు. ఇక జేసీ ఫ్యామిలీ టిడిపిలో చేరడం అనేది మా అంతర్గత వ్యవహారం అని ఆయన పేర్కొన్నారు. మీ తండ్రి హయాంలో జేసి ఏ పార్టీలో ఉన్నారో నీకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

పరిటాల రవి లేకుంటే మీ తండ్రి నామినేషన్ కూడా వేయలేకపోయాడు అని ఆయన అన్నారు. మీ నాన్న హత్య కేసులో కనీసం సాక్ష్యం కూడా చెప్పలేకపోయావని పరిటాల శ్రీరామ్ ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కాళీ సూట్కేస్ తో ధర్మవరం వచ్చాడని కానీ ఎమ్మెల్యే అయ్యాక భవనాలు ఎలా కట్టాడో అందరికీ తెలుసునని అన్నారు. ఫేస్ బుక్ లైవ్ లు పక్కన పెట్టి అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version