ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మద్య౦ షాపులు తెరవడం వివాదాస్పదంగా మారింది. ఇక ఇన్ని రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న జనం ఇప్పుడు ఒక్కసారిగా మద్యం దొరకడంతో అందరూ కూడా ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ తరుణంలో ఫుల్ గా మద్యం తాగి కొంత మంది నానా రచ్చ చేసారు. చిత్తూరు జిల్లా పలమనేరు లో జరిగిన ఒక సంఘటన కన్నీరు పెట్టిస్తుంది. చిత్తూరు జిల్లాల పలమనేరులో కిట్టన్న మిషన్ వీధిలో నివాసం ఉండే చొక్కా లింగం ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు.
లింగానికి భార్య జగదాంబ సహా నలుగురు కూతుళ్ళు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళకు పెళ్లి అయింది ఒక అమ్మాయి తిరుపతిలో నర్సింగ్ కోర్స్ చేస్తుంది. మరో కుమార్తె నందిని అమ్మా నాన్న తో కలిసి ఇంట్లోనే ఉంటుంది. వీళ్ళు ఉపాధి కోసం ఒక చిన్న టిఫిన్ సెంటర్ ని నిర్వహిస్తున్నారు లాక్ డౌన్ లో 40 రోజులుగా మద్యానికి దూరంగా ఉన్న లింగ౦ సోమవారం మద్యం దుకాణాలు తెరవడంతో ఫుల్లు గా తాగి ఇంటికి వచ్చాడు.
లింగం తాగుడు చూసిన భార్య జగదాంబ ఆ స్థాయిలో ఎందుకు తాగావని నిలదీయడం తో ఆగ్రహం పట్టలేని లింగం… భార్య మీద దాడికి దిగి ఇష్టారీతిన కొట్టాడు. నందిని అడ్డుపడటం తో ఆమె మీద కూడా ప్రతాపం చూపించాడు. కూతురు అని కూడా చూడకుండా దాడి చేసాడు. దాడి చేయడం, పక్కింటి వాళ్ళు కూడా వినడంతో మనస్తాపానికి గురైన తల్లీ కూతుళ్ళు టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి చీరలుతీసుకుని వాటితో ఉరి వేసుకున్నారు. అతనే కొట్టి చంపాడు అని లింగానికి అక్కడ గ్రామస్తులు దేహశుద్ధి చేసారు.
ఇది ఒక సంఘటన అయితే చిత్తూరు జిల్లా సరిహద్దు నెలలు జిల్లాలో పోదలుకురు మండలం పరిధిలో 60 ఏళ్ళ వ్యక్తి మద్యం కోసం వైన్ షాప్ వద్ద గంటల తరబడి నిలబడి మద్యం దొరకడంతో ఫుల్ గా తాగి సాయంత్రం ఇంటికి వచ్చాడు. గొంతులో నుంచి మాట రాకపోవడం తో భార్య మంచి నీళ్ళు ఇచ్చింది. నీళ్ళు తాగిన నిమిషాల వ్యవధిలో అతను మరణించాడు. అలాగే మరో గ్రామంలో ఇద్దరు స్నేహితులు,
ఒకే బండి మీద వైన్ షాప్ కు వెళ్లి క్యూ లో నిలబడి మద్యం తీసుకుని తాగి ఆ తర్వాత గొడవ పడి కొట్టుకున్నారు. ఒకరు మరణించారు… మరో ఘటనలో ఇద్దరు యువకులు బండి మీద ఆవుని గుద్ది మరణించారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో స్పందించారు. ఇలాంటి ఘటనలు చాలా బాధాకరమని, మద్యం షాపులను తెరవడం వలనే ఇది జరిగిందని ఆరోపించారు. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్ ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.
It’s painful to see to look at the suicides,due to opening of liquor shops in AP pic.twitter.com/N21JVCAsCM
— Pawan Kalyan (@PawanKalyan) May 5, 2020