గతంలో బాలీవుడ్ స్టార్స్ మైనపు విగ్రహాల సందడి మాములుగా ఉండేది కాదు. దీంతో తామే మొత్తం దేశాన్ని ఏలుతున్నామని వారిలో ఒక గర్వం ఉండేది. తీరా ఆ గర్వాన్ని సౌత్ ఇండస్ట్రీ పూర్తిగా అణిచివేసింది. ఎందుకంటే సౌత్ ఇండస్ట్రీ మీద వారికి ఒక హేలన భావం ఉండేది. సౌత్ వాళ్లు నల్లగా ఉంటారని దూరం పెట్టడం, చులకనగా చూసేవాళ్లు.
అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని టాలీవుడ్ బీట్ చేసింది. ఒకే ఇండస్ట్రీ నుంచి దాదాపు 4 నుంచి 5 వరకు మైనపు విగ్రహాలు ఏర్పాటయ్యాయి. అందులో తాజాగా మెగాపవర్ స్టార్ రాంచరణ్ కూడా మెంబర్ అయ్యారు. లండన్ మేడమ్ టుస్సాడ్స్‌లో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని స్వయంగా గ్లోబల్ స్టార్ చెర్రీ ఆవిష్కరించారు. విగ్రహంలో చరణ్ పెంపుడు కుక్క రైమ్ కూడా చోటుదక్కించుకుంది.
ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత మేడమ్ టుస్సాడ్స్ లో మూడో టాలీవుడ్ నటుడిగా రామ్ చరణ్ విగ్రహం కొలువుదీరింది. కాగా, మహేశ్ బాబు విగ్రహం కూడా ఏర్పాటైన విషయం తెలిసిందే.