పవన్ కళ్యాణ్ వివాదస్పద వ్యాఖ్యలు…జక్కంపూడి నిరసన దీక్ష !

-

పవన్ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై జక్కంపూడి అభిమానులు భగ్గుమన్నారు. కోరుకొండలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జక్కంపూడి కుటుంబంపై ఆరోపణలు నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు జక్కంపూడి అభిమానులు. పవన్ కళ్యాణ్ తన కుటుంబం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా.

Pawan Kalyan controversial comments on Jakkampudi

కోరుకొండ మండలం గాడాల రహదారిపై రాజానగరం సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి సోదరుడు గణేష్ నిరసన దీక్ష చేపట్టారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. రాజానగరం నియోజకవర్గం నలుముల నుండి భారీగా వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. దీనిపై జక్కంపూడి రాజా మాట్లాడుతూ…. పవన్ కళ్యాణ్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఆగ్రహించారు. 420 లను, చీటర్ లను రాజానగరంలో పోటీలో నిలబెట్టాడని ఫైర్ అయ్యారు జక్కంపూడి రాజా.

Read more RELATED
Recommended to you

Latest news