జనసేన శాసనసభాపక్షనేతగా పవన్‌ కల్యాణ్‌

-

జనసేన శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశం నిర్వహించారు. పవన్‌ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్ ఎన్నికయ్యారు.

మరోవైపు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేల భేటీ జరిగింది. ఎమ్మెల్యేలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సమావేశమయ్యారు. శాసనసభాపక్ష నేత ఎంపికపై చర్చించిన ఆమె అధిష్ఠానం ప్రకటనకు అందరూ కట్టుబడి ఉండాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రజలు కూటమిపై విశ్వాసంతో మంచి విజయం అందించారని ఈ సందర్భంగా మాట్లాడుతూ పురందేశ్వరి అన్నారు. సీఎం ప్రమాణ స్వీకార సభకు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌షా వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బీజేపీ తరఫున తామంతా సభకు హాజరవుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news