తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు నిండా మునిగి సంద్రాన్ని తలపిస్తుంటే మరోవైపు తెలంగాణలోని కొన్ని చోట్ల వరదలు ముంచేత్తుతున్నాయి. వర్షాలతో అతలాకుతలమైన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.
అయితే మంగళవారం రోజు కేవలం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికే ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. దీంతో తెలంగాణ ప్రజలను పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆయన బుధవారం రోజున తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం ప్రకటించారు.
విపత్తు సమయంలో తెలంగాణకు తన వంతుగా కోటి విరాళం ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డికి తానే స్వయంగా అందజేస్తానని చెప్పారు. కష్టాలు వచ్చినపుడు ఒకరికొకరు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ నాయకులు కూడా విరాళాలు ఇవ్వాలన్నారు పవన్ కళ్యాణ్.