సింగపూర్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

-

బ్రూనే పర్యటన ముగించుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింగపూర్ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లారు. చాంగే ఎయిర్ పోర్టులో అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. ఈ పర్యటనలో సింగపూర్ ప్రధానితో సహా, పలువురు వ్యాపారవేత్తలతోనూ ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.

ఇక గురువారం రోజు ప్రధాని మోదీ అక్కడి పార్లమెంటులో ప్రసంగిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు థార్మన్ షణ్ముగరత్నం, ప్రధాని లారెన్స్ వాంగ్ తో చర్చిస్తారు. కీలక అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులను కలుసుకుంటారు ప్రధాని. సుమారు ఆరేళ్ల తర్వాత సింగపూర్ లో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ.

ఇక సింగపూర్ లో అడుగుపెట్టగానే తన ఎక్స్ లో ప్రధాని మోదీ ఈ విధంగా పోస్ట్ చేశారు. “భారత్ సింగపూర్ మధ్య స్నేహాన్ని విస్తృతం చేస్తూ వివిధ సమావేశాలలో పాల్గొనేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇరుదేశాల మధ్య సంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నాను ” అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version