ఇవాళ విశాఖకు జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌

-

ఇవాళ విశాఖకు జనసేన పార్టీ పవన్‌ కళ్యాణ్‌ పయనం కానున్నారు. ఇవాళ విశాఖలో బాధిత మత్స్యకారులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. అగ్ని ప్రమాద బాధిత మత్స్యకారులకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయాన్ని జనసేన అధిపతి అందజేయనున్నారు.

Pawan Kalyan of Janasena party to Visakha today
Pawan Kalyan of Janasena party to Visakha today

మత్స్యకారులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం విశాఖ చేరుకొని ఫిషింగ్ హార్బర్ లోని ఘటనా స్థలాన్ని పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. బాధిత మత్స్యకారులతో పవన్ స్వయంగా మాట్లాడనున్నారు.

కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో దాదాపు 60 కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే…విశాఖ హార్బర్ లో అగ్ని ప్రమాదంలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. ఓ యూట్యూబర్ పై కేసు నమోదు చేసి…విచారణ చేస్తున్నారు పోలీసులు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news