Rashid Khan : గుజరాత్‌ టైటాన్స్‌కు బిగ్‌ షాక్‌.. రషీద్‌ ఖాన్‌కు సర్జరీ !

-

Rashid Khan :  ఆఫ్ఘనిస్తాన్ టి20 కెప్టెన్ రషీద్ ఖాన్ కు వెన్నెముక సర్జరీ సక్సెస్ అయింది. గురువారం ఈ స్టార్ ఆల్ రౌండర్ ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. ఆసుపత్రి బెడ్ మీద నవ్వుతూ విజయ సంకేతం చూపిస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Rashid Khan undergoes successful back surgery
Rashid Khan undergoes successful back surgery

“మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. సర్జరీ విజయవంతమైంది. ఇక కోలుకోవడం మీద దృష్టి పెట్టాలి. మళ్లీ మైదానంలోకి దిగేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా” అని రషీద్ తన పోస్ట్ లో రాసుకొచ్చాడు. అతడి పోస్ట్ కు ఐపీఎల్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వెంటనే స్పందించింది. ‘నువ్వు తొందరగా కోలుకుంటావు కింగ్ ఖాన్’ అని కామెంట్ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news