క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడంపై పవన్ కళ్యాణ్ స్పందించాలి – మంత్రి అమర్నాథ్

-

అనకాపల్లి నగరంలోని దాడి వీరు నాయుడు కాలేజీ ప్రాంగణం సమీపంలో నిన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమీపంలో ఉన్న దాడి వీరు నాయుడు డిగ్రీ కాలేజీ నుంచి ఓ వ్యక్తి జై జనసేన అంటూ నినాదాలు చేశాడు. జై జనసేన అంటూ నినాదాలు చేసిన వారిని అనకాపల్లి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ దివాకర్ కొట్టారని బాధితులు వాపోయారు.

ఈ వివాదం పై తాజాగా మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో రాజకీయ నినాదాలు చేశారని, జాతీయ నాయకుడికి అవమానం కలిగించేలా వ్యవహరించినందుకే పోలీసులు యాక్షన్ తీసుకున్నారని అన్నారు మంత్రి. సందర్భం ఏదైనా క్రమశిక్షణ లేకుండా వ్యవహరించడం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించాలన్నారు. మా విధానం ఇంతే అనేది జనసేన చెప్తే బాగుంటుందని సూచించారు. నిన్న జరిగిన ఘటనకు, డివిఆర్ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడవద్దన్నారు మంత్రి.

Read more RELATED
Recommended to you

Exit mobile version