ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు చాలా రసవత్తరంగా మారాయి. ఇప్పటికే అధికార వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఇప్పటివరకు 9 విడుతల వారిగా విడుదల చేసింది. టీడీపీ-జనసేన తొలి జాబితాను విడుదల చేయగా.. రెండో జాబితాను త్వరలోనే విడుదల చేయనుంది.
ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తారని.. భీమవరం, పీఠాపురం, తిరుపతి స్థానాల నుంచి ఏదో ఒక స్థానంలో పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనాని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు స్పష్టమవుతోంది. బీజేపీ పెద్దల సూచనతో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో నిలవనున్నారు. కాకినాడ నుంచి లోక్ సభ అభ్యర్థితో పాటు పీఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయనున్నట్టు సమాచారం.
అదేవిధంగా మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో జనసేన 3 పార్లమెంట్ స్థానాలు, బీజేపీ 5 పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయనుంది. టీడీపీ 09 స్థానాల్లో బరిలోకి దిగనుంది.