భారత్‌-చైనా సరిహద్దులో సేలా టన్నెల్‌ ప్రారంభించిన ప్రధాని మోదీ

-

ఇండియా-చైనా సరిహద్దులోని తూర్పు సెక్టార్‌లో నిర్మించిన సేలా టన్నెల్‌ను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాజధాని ఈటానగర్‌లో నిర్వహించిన ‘వికసిత్ భారత్‌- వికసిత్‌ నార్త్‌ ఈస్ట్’ కార్యక్రమంలో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్‌గా ఇది గుర్తింపు పొందింది.

ఈ టన్నెల్ గురించి మరిన్ని విశేషాలు మీకోసం..

సేలా టన్నెల్‌ను సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు.

బాలిపారా-చారిదౌర్‌-తవాండ్(BCT) రహదారిలో అనుసంధానం కోల్పోకుండా ఉండే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశారు.

సరిహద్దు రహదారుల సంస్థ (BRO).. ఈ రెండు వరుసల టన్నెల్‌ను నిర్మించింది.

ఈ ప్రాజెక్టులో రెండు సొరంగాలు ఉన్నాయి. టన్నెల్‌-1 సింగిల్‌ ట్యూబ్‌తో 980 మీటర్ల పొడవుండగా.. టన్నెల్‌-2 ట్విన్‌ ట్యూబులతో 1,555 మీటర్ల పొడవు కలిగి ఉంది.

పర్వతాల మధ్య సేలా పాస్‌కు 400 మీటర్ల దిగువన ఈ నిర్మాణం చేపట్టారు.

భారత్-చైనా సరిహద్దులో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో అయినా ఆయుధాలు, బలగాలను వేగంగా తరలించేందుకు ఉపయోగకరంగా ఉంటుంది.

దీంతో తవాంగ్‌-దిరాంగ్‌ ప్రాంతాల మధ్య 12 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 90 నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version