కాకినాడ పోర్టు వద్ద సముద్రంలో ప్రయాణించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేషన్ బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ నౌక వద్దకు సముద్రంలో ప్రత్యేక బోట్ లో వెళ్లారు పవన్ కళ్యాణ్. నౌకలో ఉన్న 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎవరు సరఫరా చేశారని అధికారులను ఆరా తీసిన పవన్ కళ్యాణ్.. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై 640 టన్నుల బియ్యం పట్టుబడిన స్టెల్లా ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్లి చూసారు.
పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. అలాగే ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను పోర్టు అధికారులను ప్రశ్నించారు పవన్ కళ్యాణ్.