ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురంలోని ఉపాధ్యాయులకు కానుకలు అందించారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం నేపథ్యంలో టీచర్లకు వస్త్రాలను బహుమతిగా అందించారు. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు, పిఠాపురం, కొత్తపల్లి మండలాల్లోని దాదాపు 2 వేల మంది ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీల లెక్చరర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానుకలను అందించారు.

మహిళా టీచర్లకు చీరలు, పురుషులకు ప్యాంటు, షర్టు బహుమతులుగా పంపించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లోని ఉపాధ్యాయులకు ఈ బహుమతులను అందించగా మరికొంతమందికి ఇవ్వాల్సి ఉంది. వస్త్రాలను అందుకున్న ఉపాధ్యాయులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెబుతున్నారు.