ఎమ్మెల్సీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీకలకు సమయం దగ్గర పడుతోంది.. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు
సంబంధించి కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎన్నికల బరిలో నిలిచేది ఎవరూ అనేది తేలిపోయింది.. ఇక, ఈ నెల 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. 3వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే కూటమి పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టాయి. సీఎం చంద్రబాబు మంత్రులకు.. నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ తరుణంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించారు. ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సి ఎన్నికల్లో కూటమి అభ్యర్ధుల విజయానికి జనసేన తరపున పార్లమెంట్ నియోజక వర్గాలవారీగా సమన్వయకర్తలను నియమించారు ఆ పార్టీ- అధినేత పవన్ కల్యాణ్.. ఆయా పార్లమెంట్ నియోజక వర్గాల పరిధిలో కూటమి నేతలతో సమన్వయం చేసుకొంటూ, నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం అభ్యర్థుల విజయానికి ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.

పార్లమెంట్ నియోజకవర్గాలు- జనసేన సమన్వయకర్తలు : 

కాకినాడ-తుమ్మల రామస్వామి, రాజమండ్రి-వై.శ్రీనివాసరావు, అమలాపురం- బండారు శ్రీనివాసరావు, నరసాపురం-చన్నమల్ల చంద్రశేఖర్, ఏలూరు-రెడ్డి అప్పల నాయుడు, విజయవాడ-అమ్మిశెట్టి వాసు, మచిలీపట్నం- బండి రామకృష్ణ, గుంటూరు- నయబ్ కమల్, నరసరావు పేట-వడ్రాణం మార్కండేయ బాబు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version