అల్లు అర్జున్‌ వివాదం పై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు !

-

సినిమాలపై పవన్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ్టి నుంచి పల్లె పండుగ వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 13,324 గ్రామాల్లో ఒకేసారి ప్రారంభం అయ్యాయి. కంకిపాడులో జరిగే పల్లె పండుగ వారోత్సవాల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. ఈ సందర్భంగా ప్రసగించారు. టాలీవుడ్‌ లోని హీరోలు చిరంజీవి, బాలయ్య, అల్లు అర్జున్‌, ప్రభాస్‌అందరూ బాగుండాలి.. అందరి సినిమాలు ఆడలని కోరారు. నేను సినిమా చేయాలంటే డబ్బులు కూడా ఉండాలని తెలిపారు.

Hero Allu Arjun to meet AP Deputy CM Pawan Kalyan

సినిమా హీరోలు ఎవరైనా బాగుండాలని కోరుకుంటానని చెప్పారు. సినిమా లు బాగుండాలంటే రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బాగుండాలని వెల్లడించారు. రాష్ట్రాన్ని బాగు చేసుకుని ఆ తరువాత విందులు వినోదాలు చేసుకుందామన్నారు. నెల రోజుల్లోపు ఉపాధి కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా పేర్కొన్నారు. కంకిపాడు-రొయ్యూరు వయా గూడవర్రు రోడ్డు నవీకరణ చేయాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశిస్తున్నానని ప్రకటించారు. నిదురుమొండి నుంచీ బ్రహ్మయ్యగారి మూలం, నాగాయలంక వరకూ గ్రామాల ప్రజలు వరద బారిన పడ్డారని కలెక్టర్ తెలిపిన ప్రకారం రోడ్లు వేయాలని పంచాయతిరాజ్ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version