కొండా సురేఖపై కేటీఆర్ వేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇవాళ కేటీఆర్ వేసిన పిటిషన్ పై నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్ తో పాటు నలుగురు సాక్షులు స్టేట్మెంట్లు రికార్డు చేస్తామని న్యాయస్థానం పేర్కొంది.
దీంతో ఈ నెల 18న కేటీఆర్, సాక్షులు బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ,తులా ఉమా, దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయనుంది న్యాయస్థానం. ఇక తదుపరి విచారణ 18కు వాయిదా వేసింది కోర్టు. కాగా టాలీవుడ్ హీరోయిన్లు, కేటీఆర్ మధ్య ఏదో ఉందని కొండా సురేఖ వ్యాఖ్యలు చేసి..క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే.