సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంటే.. కొందరూ సూడో మేధావులు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో ఆయన మాట్లాడారు. తాను సనాతన హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తానని చెప్పారు. నా కూతురు రష్యన్. తిరుమలకు తీసుకెళ్తే తన తరపున డిక్లరేషన్ ఇచ్చి నా నిబద్ధతను చాటుకున్నా. భిన్నత్వంలో ఏకత్వం చూపించేదే సనాతన ధర్మం అని చెప్పారు.
సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టాలు కూడా ఎలా పని చేస్తాయంటే సనాతన ధర్మం పాటించే వారిపై నిర్దాక్షిణ్యంగా, అన్య ధర్మాలను పాటించే వారిపై మానవత్వం చూపిస్తాయి. అయిన వాళ్లకి ఆకులు.. కాన వాళ్లకు కంచాలు అన్న దుస్థితి దాపురించిందిఇప్పుడు ఆకులు కూడా లేవు. చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారని తీవ్ర స్థాయిలో స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.