ఏపీలో హాట్ హాట్ టాపిక్ల్లో పవన్ పోటీ చేయబోయే సీటు కూడా ఒకటి అని చేపవచ్చు. వచ్చే ఎన్నికల్లో పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. పవన్ పోటీ చేయబోయే సీటుపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయిన పవన్ గాని, జనసేన పార్టీ గాని సీటుపై క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కూడా ఇంతవరకు ఒక సీటుని ఎంపిక చేసుకుని అక్కడ గ్రౌండ్ వర్క్ చేయట్లేదు.
టిడిపితో పొత్తు ఉంటే పవన్ ఎక్కడ పోటీ చేసిన పెద్ద రిస్క్ ఉండకపోవచ్చు. కాకపోతే పొత్తు లేకపోతే మాత్రం రిస్క్ తప్పదు..ఏ సీటులో పడితే ఆ సీటులో పోటీ చేయడానికి సాధ్యం కాదు..జనసేనకు బాగా బలం ఉన్న సీట్లలోనే పోటీ చేయాలి. గత ఎన్నికల్లో పవన్..గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. మరి ఈ సారి కూడా ఆ స్థానాల్లోనే పోటీ చేస్తారా? అంటే చెప్పలేని పరిస్తితి.
కాకపోతే పవన్..పిఠాపురం, కాకినాడ రూరల్, భీమిలి, తిరుపతి..ఇలా పవన్ పోటీ చేసే సీట్లపై ప్రచారం మాత్రమే నడిచింది. పవన్ పొత్తు లేకుండా ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయడం అనేది కష్టమైన పని. కాబట్టి పవన్ పక్కా ప్రణాళిక ప్రకారమే బరిలో దిగాలి. ఇప్పుడున్న పరిస్తితుల్లో జనసేనకు గట్టి పట్టున్న స్థానాల్లో భీమవరం, గాజువాక, పిఠాపురం, అమలాపురం, రాజోలు, నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లు ఉన్నాయి. అంటే ఈ సీట్లలో టిడిపి కంటే జనసేన ముందు ఉంది.
వీటిల్లో రాజోలు, అమలాపురం సీట్లు ఎస్సీ స్థానాలు అక్కడ పోటీ కుదరదు. మిగతా స్థానాల్లో ఛాన్స్ ఉంది. అందులో భీమవరంలో సింగిల్ గా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి జనసేన అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం పవన్ భీమవరంలోనే పోటీ చేసే ఛాన్స్ ఉంది.