కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలి – పెద్దిరెడ్డి

-

కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని పిలుపపునిచ్చారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పుంగనూరు నియోజకవర్గం సదుం మండలంలో పర్యటిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి… ఈ సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర ఏళ్లు అధికారంలో ఉండి ఇప్పుడు బిజెపి నుండి ఒక వ్యక్తి పోటీ చేస్తున్నారన్నారు.

Peddireddy fires on Kiran Kumar Reddy

జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేయిస్తాను, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొడతాను అని డిల్లో లో చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పొందారని వివరించారు. హైదారాబాద్ లో ఒక ఆఫీస్ ఓపెన్ చేసి నేరుగా కమిషన్లు వసూలు చేసిన ఘనుడు కిరణ్ కుమార్ రెడ్డి అని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అభివృద్ధిని అడ్డుకున్నారని.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టి, రాజధాని లేకుండా చేసిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ నిప్పులు చెరిగారు.
అలాంటి వ్యక్తి నేడు బిజెపి నుండి రాజంపేట ఎంపిగా శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేస్తున్నారు… కిరణ్ కుమార్ రెడ్డిని చిత్తు చిత్తు గా ఓడించాలని పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version