ఇది తీగ మాత్రమే, మున్ముందు డొంకంతా కదిలి తీరుతుంది.. -పేర్ని నాని

-

ఇది తీగ మాత్రమే, మున్ముందు డొంకంతా కదిలి తీరుతుందంటూ ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చురకలు అంటించారు. చంద్రబాబు రిమాండ్‌ పై పేర్నినాని మీడియాతో మాట్లాడుతూ…..అమరావతి సీఐడీ తనను అరెస్ట్‌ చేస్తుందనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసు అన్నారు. సంకల్పంతో, పట్టుదలతో పనిచేసిన అధికారి చేతికి చంద్రబాబు దొరికిపోయారని మండిపడ్డారు.

perni nani comments on chandrababu remand
perni nani comments on chandrababu remand

1977 నుంచి స్కాములు చేస్తున్న చంద్రబాబు, ఇన్నేళ్లు పట్టుబడకుండా నక్కజిత్తుల స్టేలు తెచ్చుకుంటూ కాలం నెట్టుకొచ్చారని తెలిపారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఆడియో టేపులతో చంద్రబాబు దొరికిపోయారని గుర్తు చేశారు పేర్ని నాని. ఇది తీగ మాత్రమే, మున్ముందు డొంకంతా కదిలి తీరుతుందని హెచ్చరించారు. కేంద్రం నుంచి నోటీస్‌ రాగానే స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కీంకు సంబంధించిన ఫైల్స్ మాయం చేశారని మండిపడ్డారు పేర్ని నాని. పవన్ గతంలో కేంద్రం లో చక్రం తిప్పిన చంద్రబాబు చూసేదానికి ఢిల్లీ నుంచి ఒక్కరూ రాలేదే అంటూ చురకలు అంటించారు పేర్ని నాని.

Read more RELATED
Recommended to you

Latest news