స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు జైలుపాలైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం ఆయన్ని అదుపులోకి తీసుకున్న ఏపీ సిఐడి పోలీసులు.. తాజాగా ఏసీబీ కోర్టులో హాజరు పర్చిన ఆయనకు రిమాండ్ విధించారు. 14 రోజుల పాటు రిమాండ్ విధించగా, రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక బాబుని అరెస్ట్ చేయడంతో టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బండి చేస్తున్నాయి. అటు టిడిపికి జనసేన మద్ధతు తెలుపుతుంది
.
కేవలం కక్షపూరితంగానే బాబుని అరెస్ట్ చేశారని టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి. అటు బాబు తప్పు చేయడం వల్లే జైలు పాలయ్యారని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మొత్తానికి బాబు అరెస్ట్ తో ఏపీ రాజకీయాలు వ్యూహాత్మకంగా మారుతున్నాయి. ఇదే సమయంలో బాబు అరెస్ట్ పై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా కొందరు నేతలు బాబు అరెస్ట్‌ని ఖండిస్తుంటే..మరికొందరు అరెస్ట్ కరెక్ట్ అని చెబుతున్నారు.
ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి కేటిఆర్..అనూహ్యంగా వేరే సందర్భంలో చేసిన ఓ ట్వీట్ సంచలనంగా మారింది. తాజాగా హైదరాబాద్ లో జరిగిన నథింగ్ మేక్స్ సెన్స్ అనే ప్రోగ్రాం ద్వారా ఆద్యంతం నవ్వుకున్నానని, వరుణ్ గ్రోవర్ షో అద్భుతంగా చేశారని, చాలాకాలం తర్వాత ఇంత బాగా నవ్విన అని కేటిఆర్ చెప్పుకొచ్చారు.
అయితే చంద్రబాబు అరెస్ట్ సమయంలోనే కేటిఆర్ ఈ ట్వీట్ చేయడంతో..పరోక్షంగా బాబుని అరెస్ట్ ఉద్దేశించే కేటిఆర్ ఈ ట్వీట్ చేశారని రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. మొత్తానికి బాబు అరెస్ట్ దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది.