2019లో నేనే సీఎంగా ప్రమాణం చేస్తానంటూ చంద్రబాబు కొత్తబట్టలు కూడా కుట్టించుకున్నాడు: పేర్ని నాని

-

టీడీపీ నేతల విమర్శలు, వైఎస్ఆర్సిపి ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారంపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. 2019లో నేనే సీఎంగా ప్రమాణం చేస్తానంటూ చంద్రబాబు నాయుడు కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని, కానీ పదవి ఊడేదాకా చంద్రబాబుకు విషయమే తెలియలేదన్నారు. ప్రజలతో మమేకమై ఉంటేనే కదా ఆయనకు ప్రజాస్పందన తెలిసేది.

ఇప్పుడు కూడా ఊహల్లోనే బతుకుతున్నాడు.. పార్టీని బతికించాలి.. కొడుకు నాయకత్వాన్ని బతికించాలి అనే తాపత్రయం తప్ప ఇంకేం కనిపించడం లేదని, ప్రజల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితి ఏంటో ఆయనకు తెలుస్తోందని పేర్ని నాని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో.. పార్టీలకు అతీతంగా అందరి అభిప్రాయం తెలుసుకోవాలని సీఎం జగన్ చెప్పారని, సంక్షేమ పథకాలు అందకున్నా, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే.. విమర్శలను స్వీకరించి పొరపాట్లను సరిదిద్దాలని నేతలకు సీఎం జగన్ ను దిశానిర్దేశం చేశారని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version