ఎన్టీఆర్ సినిమాను బాగుందని ఒక్కసారైనా అన్నారా ? అని చంద్రబాబు, నారా లోకేష్ ను అడ్డంగా ఇరికించారు పేర్ని నాని. సినిమాలను చంద్రబాబు, నారా లోకేష్ రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆగ్రహించారు. పవన్ కళ్యాణ్ సినిమాను తొక్కేస్తున్నామని.. చంద్రబాబు ఆరోపిస్తున్నారన్నారు. ఓ సినిమా కోసం తండ్రీ కొడుకులు పిల్లి మొగ్గలు వేస్తున్నారని ఆగ్రహించారు పేర్ని నాని. హై కోర్టు తీర్పు అన్నా.. ప్రభుత్వం అన్నా విపక్ష నేతలకు లెక్కలేదని పేర్ని నాని ఫైర్ అయ్యారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు బ్లాక్ టికెట్లు అమ్మడాన్ని ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నీతులు చెప్పే ఓ హీరో నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ విమర్శించారు.బ్లాక్ లో టికెట్లు అమ్మితే ప్రభుత్వం పట్టించుకోవద్దా…? అని ప్రశ్నించారు. గొప్ప సేవలను అందించినటువంటి మంత్రి గౌతం రెడ్డి చనిపోవడంతో రాష్ట్రం అంతా దు:ఖంలో ఉంది. దీంతో జీవో లేటు అయింది. దీనికి మానవత్వం లేకుండా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు అని విమర్శించారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగజారుతారని విమర్శించారు. మనుషుల విలువ తెలియకుండా.. ఎన్టీఆర్ మరణం సమయంలో కూడా రాజకీయాలు చేశారని విమర్శించారు.