రైతులకు బీజేపీ ద్రోహం చేసింది – జైరాం రమేష్

-

ఎన్నికల నేపథ్యంలో హర్యానాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. రైతుల సమస్యలను బిజెపి ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. రైతుల గౌరవప్రదమైన జీవనం, అభివృద్ధిపై బీజేపీకి ఉన్న విజన్ ఏంటి..? అని ప్రశ్నించారు.

రైతులకు బీజేపీ ద్రోహం చేసిందని మండిపడ్డారు జైరాం రమేష్. మోడీ ప్రభుత్వంపై హర్యానా ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. 2021 లో సాగు చట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి..? వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారు..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హర్యానాలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇస్తుందన్నారు.

అంతేకాకుండా రుణమాఫీ తో పాటు 30 రోజులలోగా పంట బీమా కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు. ఇక లైంగిక వేధింపులకు పాల్పడే వారికి బిజెపి ఆశ్రయం కలిగిస్తుందని విమర్శించారు జైరాం రమేష్. హర్యానా మహిళా రెజ్లర్లపై బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడని.. అతడిని శిక్షించకుండా అతని కుమారునికి టికెట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version