నంద్యాల అబ్దుల్ సలాం కుటుంభ ఆత్మహత్య కేసులో హైకోర్టులో పిల్ ధాఖలు అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా జాతీయ స్థాయిలో సంచలనం అయింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు హైకోర్ట్ లో వాదనలు ప్రారంభం కానున్నాయి. అబ్దుల్ సలాం కేసు సీబీఐ కి అప్పగించాలని డిమాండ్ చేస్తూ హైకోర్టులో ఆల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ఏపీ ప్రధాన కార్యదర్శి కాజావలి పిల్ దాఖలు చేసారు.
కేసులో నిందితులుగా ఉన్న పోలీసులు విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి రావని పిటిషన్ లో పిటీషన్ లో పేర్కొన్నారు. పిటీషనర్ తరుపున న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపిస్తారు. సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో వేసిన పిటీషన్ లో న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు. దీనితో ఇప్పుడు పోలీసుల మీద విచారణకు సిబిఐ ధర్యాప్తుకి అవకాశం ఉండవచ్చు.