పిఠాపురంలో కూటమిలో ముసలం చోటు చేసుకుంది. తాజాగా వర్మ ట్వీట్ వైరల్ కావడంతో… తెరపైకి కొత్త పంచాయితీ వచ్చింది. కష్టపడి సాధించే విజయానికి గౌరవం అంటూ ట్వీట్ చేసి డిలీట్ చేశారు వర్మ. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. కాసేపటికి డిలీట్ చేశారు ట్వీట్.
తన సోషల్ మీడియా అకౌంట్స్ సోషల్ ప్లానెట్ సంస్థ మెయింటైన్ చేస్తుందంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియోకు తనకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు వర్మ. తన పర్మిషన్ లేకుండా తప్పుడు వార్తలు పోస్ట్ చేస్తే తగు చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు వర్మ. ఇక వర్మ పర్మిషన్ లేకుండా ట్వీట్ చేశామని వివరణ ఇచ్చింది సోషల్ ప్లానెట్ సంస్థ. దీంతో తెరపైకి కొత్త పంచాయితీ వచ్చింది.