ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా జలాలను అక్రమంగా తరలిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవలే కృష్ణా నది యాజమాన్య బోర్డు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే కేఆర్ఎంబీ చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం బోర్డు సమావేశం కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేయాలని కోరుతూ.. ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఆర్ఎంబీ కి లేఖ రాశారు.
అత్యవసర సమావేశం ఉన్నందున భేటీని వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు నీటి పారుదల శాఖ అధికారులు కేఆర్ఎంబీ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ వాదనలు వినిపించనున్నారు. ముఖ్యంగా తాగు, సాగు నీటి అవసరాలను బోర్డుకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.