“మగాడివైతే గాజువాకలో గెలిచి రా, ఇక్కడ ఇంకొకడి సీటు లాక్కోవడం కాదు.” అంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ పై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. దింతో పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య వివాదం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పిఠాపురం నుండి పోటీ చేయబోతున్నాను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎప్పటి నుండో కొనసాగుతున్న సస్పెన్స్ కి బ్రేక్ పడింది పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారని తెలిపారు.
పొత్తులో భాగంగా పిఠాపురం పవన్ కళ్యాణ్‌కు కేటాయించడంతో చంద్రబాబు, లోకేష్‌ను తిడుతున్నారు టీడీపీ అభ్యర్థి వర్మ అభిమానులు. అటు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంపై ఆగ్రహంలో వర్మ అనుచరులు రెచ్చిపోయారు. టీడీపీ ఫ్లెక్సీలు జెండాలు తగలబెట్టారు వర్మ అనుచరులు.పిఠాపురం నుంచి వర్మ పేరు ప్రకటించాలని టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. లేదా ఇండిపెండెంట్‌గా వర్మ పోటీకి దిగాలని అనుచరులు ఆందోళనకు దిగారు.