తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం టికెట్ కౌంటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మరో 59 మంది గాయాలపాలయ్యారు. ఈ క్రమంలోనే సోమవారం తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. ఈనెల 8న జరిగిన తొక్కిసలాట చాలా బాధకరమని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటన పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు.కొందరు తనపై కావాలనే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ రాస్తున్నారని ఆరోపించారు. తిరుమలకు సంబంధించి తనపై నిరాధార వార్తలు రాయొద్దని రిక్వెస్ట్ చేశారు.తొక్కిసలాటలో గాయపడిన 31 మందికి చెక్కులు అందజేశామని, మిగతా 28 మందికి కూడా మంగళవారంలోపు పంపిణీ చేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.