ప్రధాని మోడీ మన్ కీ-బాత్ ప్రసంగంలో తిరుపతి ప్రస్తావన

-

ప్రధాని మోడీ మన్ కీబాత్ ప్రసంగంలో తిరుపతి ప్రస్తావన వచ్చింది. మొదట హిందీలో ప్రధాని మన్ కీ బాత్ ప్రసంగం ప్రారంభం కాగా, 11:30 నుంచి తెలుగులో ప్రధాని మన్ కీ బాత్ కొనసాగింది. దేశంలో డ్రగ్స్, మత్తు పదార్ధాలు లేకుండా చేయడం, యువతను వాటి నుంచి దూరం చేయడం పై ప్రధాని మోడీ ప్రసంగించారు.

75 సంవత్సరాల స్వతంత్రం వేడుకల సమయంలో యువత ప్రాధాన్యత ప్రసంగించారు. అలాగే, పలు దేశాలలో ఉండిపోయిన భారత కళాకృతులను వెనక్కు తీసుకు వచ్చామని తెలిపారు ప్రధాని మోడీ. ప్రసాద్ స్కీం తిరుపతిలో భక్తులు, యాత్రికుల కోసం అందుబాటులోకి తెచ్చాం అని ప్రధాని మోడీ తెలిపారు. ఇక అటు దీనిపై పురంధేశ్వరి మాట్లాడుతూ..మోదీ మన్ కీ బాత్ లో సమాజిక అంశాలు, మంచి పనులు ఉంటాయి… మన్ కీ బాత్ ని రాజకీయాలకు ముడి పెట్టద్దని కోరారు. జమ్ము కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న మంచి పనులు తెలిసేలా చేసేది మన్ కి బాత్ ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version